పత్తికొండ (కర్నూలు) : యుటిఎఫ్ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా .... శుక్రవారం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు యుటిఎఫ్ ప్రచార జాతను ప్రారంభించారు. పత్తికొండ మండలం గోపాలప్లాజాలో యుటిఎఫ్ జెండాను ఆవిష్కరించారు. గోపాల ప్లాజా నుంచి బైక్ ప్రచార యాత్రను అంబేద్కర్ సర్కిల్ వరుకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.










