ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:అక్రమంగా ఇన్నోవా కారులో గంజాయిని తరలిస్తుండగా స్థానిక ఎస్సై రవీంద్రకు ముందస్తు సమాచారం పోలీస్ సిబ్బంది, ఏపీఎస్పీ బెటాలియన్ బలగాలను అలెర్ట్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని దారపల్లి జంక్షన్ వద్ద పోలీసులు మోహరించి చాకచక్యంగా పట్టుకున్నారు. స్థానిక ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కించాయిపుట్ గ్రామం నుండి వస్తున్న ఇనోవ కారులో 50 కేజీల గంజాయి తరలిస్తున్నారు. పోలీసు బలగాన్ని చూసి, కారులో ఉన్న వారు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. ఒకరు పరారయ్యారు. ఇన్నోవా కారులో రెండు ప్లాస్టిక్ బస్తాలలో 50 కిలోల గంజాయి, రెండు ప్లాస్టిక్ సంచులు ఉన్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని 50 కిలోల గంజాయి, ఇన్నోవా కారు, ఒక మొబైల్‌ను ఎస్సై రవీంద్ర స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల గంజాయి విలువ సుమారు లక్ష ఉంటుందని అంచనా.కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పరారైన నిందితుడిని త్వరలోనే సోదాలు నిర్వహించి పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మూర్తి, పోలీసులు డి రమేష్, కే.సంజీవ్ పాల్గొన్నారు.










