ప్రజాశక్తి-ఆలూరు
ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఆగస్టు 4న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖమంత్రి గుమ్మానూ జయరామ్ తెలిపారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జాబ్‌మేళా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ ప్రయివేట్ కంపెనీలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, పిజి, ఐటిఐ, డిప్లొమా, ఎంబిఎ, బిటెక్ చదివిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేలు నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు షషష.aజూరరసష.ఱఅ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 9010003132, 9014588552 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె.శంకర్ ప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేస్తున్న మంత్రి గుమ్మనూరు










