కాబూల్ ప్రిమియర్ లీగ్
కాబూల్: కాబూల్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా షాహిన్ హంటర్స్‌ాఅబసిస్ హంటర్స్ జట్ల మధ్య శనివారం జరిగిన టి20 లీగ్ ఓ రికార్డు నమోదైంది. షాహిన్ హంటర్స్ ఎడమచేతి వాటం బ్యాటర్ సెద్ధిఖుల్లా అటల్ ఒక ఓవర్‌లో ఏకంగా 48పరుగులు రాబట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. అమిర్ జజారు వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన సెద్ధిఖుల్లా.. ఓ నో బాల్‌నూ సిక్సర్‌గా మలిచాడు. ఆ ఓవర్‌లోనే మరో ఐదు వైడ్స్ కూడా పడ్డాయి. మొత్తమ్మీద 56బంతులు ఎదుర్కొని అటల్ 118పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, 10సిక్సర్లు ఉన్నాయి. దీంతో షాహిన్ హంటర్స్ జట్టు 20 ఓవర్లలో 213పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో అబసిన్ డిఫెండర్స్ 18.3ఓవర్లలో 121పరుగులకు ఆలౌటైంది.










