రైలు గుద్దేయడంతో మృతి చెందిన గొర్రెలు
ప్రజాశక్తి - సీతానగరం : స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో పాత రైల్వే గేట్ సమీపాన రైలు ఢకొీని సుమారు 45 గొర్రెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు ప్రకారం మండలంలో పెదభోగిలికి చెందిన డి.అప్పలనాయుడు, నాగళ్ల రాము, పాపమ్మ వలసకు చెందిన కోడిబోను మంగయ్యకు చెందిన సుమారు 45 గొర్రెలు తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో బొబ్బిలి నుండి పార్వతీపురం వైపు వెళ్తున్న గూడ్స్ ఢకొీని మృతి చెందాయి. ఈ సంఘటనలో సుమారు రూ. రెండు లక్షల 50 వేలు విలువైన గొర్రెలు మృతి చెందినట్టు బాధితులు వాపోతున్నారు. ఈ సంఘటనపై బొబ్బిలి ్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










