తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియకు ముగింపు పలికారు. ఇక, ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు భారీ సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు క్యాండీడెట్స్ భారీ ర్యాలీలతో ఆర్‌ఓల ఆఫీసులకు వెళ్లి నామినేషన్ వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి సీట్లు దక్కని వారు రెబల్స్‌గా కూడా పోటీ చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4355 మంది నామినేషన్లు వేశారు. తెలంగాణలో మొన్నటి వరకు కేవలం 2,474 నామినేషన్లు దాఖలు కాగా.. శుక్రవారం చివరిరోజు 2327 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, గురువారం రోజున ప్రముఖ నేతలు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు 15వ తేదీలోపు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు అని తెలిపింది.










