హైదరాబాద్ : పార్క్‌హయత్‌లో సీఎంఎస్టీఈఐ గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ మీట్‌కు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 3వ తేదీ తర్వాత తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. దేవుడు మనిషిని పుట్టించాడని.. మనిషి కులాన్ని పుట్టించాడన్నారు. ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయని బలంగా నమ్ముతానని కేటీఆర్ పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. సరైన సమయంలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సీఎం ఎస్టీ ఈ ప్రోగ్రాం ద్వారా విజయం సాధించిన 500 మంది గిరిజన సోదరులు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలన్నారు.










