పార్వతీపురం: రాష్ట్రీయ పోషణ మాV్‌ా ఈనెల 30వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రాష్ట్రీయ పోషణ మాV్‌ా కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ప్రారంభించారు. ''సుపోషిత్ భారత్, సాక్షర భారత్, సశక్త భారత్'' శీర్షికన రాష్ట్రీయ పోషణ మాV్‌ా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిశువులకు తల్లి పాలు, అదనపు ఆహారం అందించడం, పౌష్ఠికాహారం పెంపొందించడం, రక్తహీనత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించాల న్నారు. పౌష్టికాహారం తయారీ, చిరు ధాన్యాలు వినియోగం, ఉపయోగాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. రక్త హీనత పరిస్థితులు తెలుసుకొనేందుకు చిన్నారులకు, గర్భిణీలకు, పునరుత్పత్తి దశలో ఉన్న మహిళల వివరాలు తెలుసుకొనుటకు మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో శిబిరాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెసి ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాథరావు, ఐసిడిఎస్ పిడి కె.విజయగౌరి, డ్వామా పీడీ కె.రామచంద్ర రావు, డిఇఒ ఎన్.ప్రేమ కుమార్ పాల్గొన్నారు.










