ప్రజాశక్తి-సీతానగరం : ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు సిపిఎం సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు తెలిపారు. స్థానిక గాయత్రీ కళాశాలలో శనివారం సిపిఎం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడుతూ, పోరాటాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో ధరల పెరుగుదలతోపాటు మతోన్మాద శక్తుల దాడులు పెరిగాయన్నారు మణిపూర్ ఘటనలో చాలామంది అమాయకులు హింసించబడ్డారని తెలిపారు. బిజెపి మతోన్మాద శక్తుల దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. వైసిపి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచిందన్నారు. నిత్యావసర వస్తులు ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై వైసిపి, టిడిపి, జనసేన మాట్లాడడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యాన సమరభేరి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి లక్ష్మునాయుడు, మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, మండల నాయకులు జి.వెంకటరమణ, బి.అప్పారావు, ఆర్.రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
పాచిపెంట : పాచిపెంట మండల కేంద్రంలో సిపిఎం మండల నాయకులు మంచాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమరభేరి వాల్‌పోస్టర్‌ని విడుదల చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, తదితర డిమాండ్లపై సమరభేరి చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు ఎం.గంగరాజు, పాముల సన్యాసి, జి.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : బియ్యాలవలస పంచాయతీ మంత్రజోల గ్రామంలో శనివారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొల్లి గంగు నాయుడు, జిల్లా నాయకులు ఎం.శ్రీనివాసరావు , జియ్యమ్మవలస మండల కార్యదర్శి కె.సీతారాం సమరభేరి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీనికి కారణం మోడీ విధానాలేనని స్పష్టంచేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 30 నుండి సెప్టెంబర్ 4 వరకు ప్రచారం చేసి, సెప్టెంబర్ 1న సచివాలయాల వద్ద, 4న తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం : మోడీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని సిపిఎం మండల కార్యదర్శి కోలక అవినాష్ తెలిపారు. గుమ్మలక్ష్మీపురంలో సమరభేరి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామాల్లో ప్రచారం, సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 1న గ్రామ సచివాలయాల వద్ద ధర్నాలు, 3న నిరుద్యోగ వ్యతిరేక దినం , 4న మండల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ, మండల నాయకులు సన్యాసిరావు, మోహనరావు, రమేష్ పాల్గొన్నారు.
సీతంపేట : కేంద్ర ప్రభుత్వం అనుసరిసున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టే సమరభేరి పోస్టర్లను సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతి రావు ఆవిష్క రించారు.
ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎ.భాస్కర రావు, జె.శ్రీరాములు, ఎం. వెంకట రావు, జె.సుంద రమ్మ, జె.మధు సూదన్,
తదితరులు పాల్గొన్నారు.










