కరపత్రాన్ని విడుదల చేస్తున్న యాజమాన్యం
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలోని రావుస్ డిగ్రీ కళాశాలలో నవంబర్ 2న రావుస్ కళాశాల ఆధ్వర్యంలో 'హెట్రో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ' వారితో నిరుద్యోగులకు ఆఫ్ క్యాంపస్ నియామకాలు జరగనున్నాయని రావుస్ డిగ్రీ కళాశాల సిఇఒ తిరుమలరెడ్డి తెలిపారు. సోమవారం నియామకాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బిఫార్మసీ, ఐటిఐ ఫిట్టర్ డిప్లొమా ఇన్ మెకానికల్ చదివిన వారు ఈ 'ఆఫ్ క్యాంపస్' నియామకాలకు అర్హులని తెలిపారు. వార్షిక ఆదాయం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఇర్ఫాన్, నోడల్ ఆఫీసర్ రాఘవేంద్ర పాల్గొన్నారు.










