Jun 24,2023 19:42

మాట్లాడుతున్న ఇఒ లవన్న

29న మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

ప్రజాశక్తి - శ్రీశైలం

శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామికి ఈనెల 29వ తేదీన సహస్ర గటాభిషేకం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో ఇఒ మాట్లాడుతూ 29న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చేస్తున్న పూజల్లో భాగంగా లోక కళ్యాణ అర్థం సకాలంలో వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ఈనెల 27 నుండి మూడు రోజులపాటు జప పారాయణలు నిర్వహించి, 29న రుద్ర హౌమం నిర్వహించబడుతుం దన్నారు.
29న ఆర్జిత సేవలు నిలుపుదల
మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్న సందర్భంగా 29వ తేదీన అన్ని ఆర్థిక సేవలో నిలుపుదల చేయబడుతున్నట్లు ఇఒ తెలిపారు. సహస్ర ఘటాభిషేకం సందర్భంగా 28వ తేదీన రాత్రి దర్శనాల ముగిసిన తర్వాత స్వామివారి గర్భాలయ ద్వారం వద్ద తాత్కాలిక గోడ నిర్మిం చబడుతుంది. 29న ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. 29న ఉదయం 9 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. సహస్ర గటాభిషేకం కారణంగా 29న రోజంతా స్వామివారు ఘటాభిషేకం జలంలోనే ఉంటారు. మరుసటి రోజు 30 తేదీన తెల్లవారుజామున మంగళ వాయిద్యాలకు ముందుగా గోడను తొలగించి ఘటాభిషేకం జలాన్ని తీసివేసి స్వామివారికి యధావిధిగా పూజలు నిర్వహించ బడతాయి. 29వ తేదీన స్వామివారికి అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేయబడతాయని భక్తులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, పిఆర్‌ఓ శ్రీనివాసులు, శ్రీశైల ప్రభ సంపాదకులు డాక్టర్‌ సి.అనిల్‌కుమార్‌, దేవ స్థానం ఉద్యోగ సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.