ప్రజాశక్తి- కొండపి : ఓటరు ముసాయిదా జాబితాను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఇఆర్‌ఒ నారధముని తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో ఆరు మండలాల అదికారులు, రాజకీయ నాయకులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారధముని మాట్లాడుతూ గ్రామాలలో బిఎల్‌ఒలు ఇంటింటి చేసిన సర్వే ప్రకారం ఓటరు జాబితాను ఈనెల 27న రాజకీయ పార్టీ నాయకులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాలో ఏమైన తప్పులు సవరణలు, తొలగింపులు, చేర్పులు ఉంటే డిసెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. పూర్తి స్థాయిలో ఓటరు జాబితాను 2024 జనవరి 5న విడుదల అవుతుందన్నారు.
మండలాల వారీగా ఓటరు జాబితా ఇలా....
కొండపి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో బిఎల్‌ఒలు నిర్వహించిన ఇంటింటి సర్వే ప్రకారం మొత్తం 2,33,819 ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మర్రిపూడి మండలంలో స్త్రీలు 16,975, పురుషులు 16,265 కలిపి మొత్తం 33,240 మంది ఓటర్లు ఉన్నారు. పొన్నలూరు మండలంలో స్త్రీలు 16,467, పురుషులు 16,472, మొత్తం 32,939 మంది ఓటర్లు ఉన్నారు. జరుగుమల్లి మండలంలో స్త్రీలు 16,148, పురుషులు 16,599 కలిపి మొత్తం 32,749 మంది ఓటర్లు ఉన్నారు. కొండపి మండలంలో స్త్రీలు 16,914, పురుషులు 17,241 కలిపి మొత్తం 34156 మంది ఓటర్లు ఉన్నారు. టంగుటూరు మండలంలో స్త్రీలు 23,569, పురుషులు 25,021 కలిపి మొత్తం 48591 మంది ఓటర్లు ఉన్నారు. శింగరాయకొండ మండలంలో స్త్రీలు 25,508, పురుషులు 26, 636 మంది మొత్తం 52144 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.










