Jul 24,2023 19:03

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ఈనెల 26న విజయవాడలో జరిగే ఎపిఎస్‌పిడిసిఎల్‌ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డివిజనల్‌ కార్యదర్శి మల్లికార్జున కోరారు. సోమవారం డివిజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎపిఎస్‌పిడిసిఎల్‌ కార్యాలయం వద్ద గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్‌ ఉద్యోగులకు 45 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్‌సి ఇవ్వాలని, విద్యుత్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. విద్యుత్‌ కార్మికులకు ఇపిఎఫ్‌ నుంచి జిపిఎఫ్‌గా మార్చాలని తదితర సమస్యలపై సదస్సులో చర్చించి కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు. కార్మికులు దాదా పీరా, గాది లింగప్ప, ఎఎల్‌ఎం విజయ మోహన్‌ రెడ్డి, యుడిసి ఈశ్వరయ్య, జెఎల్‌ఎంజి-2 గదాల లింగప్ప, మల్లికార్జున, కాంట్రాక్ట్‌ కార్మికులు వెంకటేశ్వర్లు, రఫిక్‌ పాల్గొన్నారు.