Aug 21,2023 22:49

 జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు
ప్రజాశక్తి-అవనిగడ్డ :
ఈనెల 26, 27 తేదీల్లో సిపిఎం పార్టీ జిల్లా శిక్షణా తరగతులు అవనిగడ్డలోని ఆర్యవైశ కళ్యాణమండపంలో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు తెలిపారు. సోమవారం అవనిగడ్డలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా దేశంలో,రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే పోరాటాలు, ఉద్యమాలకు సంబంధించి ఆర్థిక, రాజకీయ,సామాజిక అంశాలపట్ల పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా పట్టణంలో డోర్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఇంటింటికీ, వ్యాపార సముదాయాలకు వెళ్లి వారికి కరపత్రాలు అందజేసి శిక్షణా తరగ తులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శీలం నారా యణరావు, వై.మధు, మురాల వెంకటేశ్వ రరావు, శివనాగేంద్రం, బూర సుబ్రహ్మణ్యం, పార్టీ సీనియర్‌ నాయకులు అవుల బసవయ్య, కోడూరు మండల పార్టీ కార్యదర్శి పోలాబత్తిన మోహనరావు, మోపిదేవి మండల పార్టీ కార్యదర్శి బండి ఆదిశేషు, శీలం ప్రకాశం, రాజేష్‌, ఎస్‌.రాజేష్‌,కరిముల్లా పాల్గొన్నారు.