ప్రజాశక్తి - జీలుగుమిల్లి
వైద్య సిబ్బంది 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని డిఎమ్‌అండ్‌హెచ్‌ఒ డా.ఎస్.శర్మిష్ట తెలిపారు. గురువారం కుక్కునూరు పర్యటన అనంతరం సాయంత్రం జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అదే విధంగా ఆసుపత్రిలో డెలివరీ రిపోర్ట్‌లో డెలివరీ కేసులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది చూడాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు రికార్డులను, ఆసుపత్రి పరిసరాల ను పరిశీలించారు.










