Mar 18,2023 22:30

karapatranni aviskaristunna sambasivarao, rammohanarao, sudharani, vijayalakshmi

21న శ్రీనిర్మలాదేవి శత జయంతి ఉత్సవాలు
ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌
సామాజిక రుగ్మతలకు దివ్యౌషధంగా సహజయోగ మార్గాన్ని ప్రపంచానికి అందించిన మహనీయురాలు శ్రీ మాతాజీ నిర్మలాదేవి అని ఆంధ్రప్రదేశ్‌ సహజయోగ ట్రస్ట్‌ సభ్యులు అడపా రామ్మోహనరావు, ఎపి ఆంధ్రప్రదేశ్‌ సహజయోగ ట్రస్ట్‌ సలహాదారు మద్దాల సాంబశివరావు చెప్పారు. విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశ్వమానవ కళ్యాణం కోసం 1970, మే 5న సహజయోగాన్ని స్థాపించారన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లోని ప్రజలు సహజయోగ ధ్యానం ద్వారా అంతర్గత శాంతి, ఆనందం పొందుతున్నారని వివరించారు. సహజయోగ ట్రస్ట్‌ రాష్ట్ర ప్రచార సమన్వయ కర్త ఎస్‌.శంకర్‌, సహజయోగ ధ్యాన కేంద్రం గుంటూరు జిల్లా మహిళా విభాగం కోఆర్డినేటర్‌ సుగ్గుల సుధారాణి, సహజ యోగ ధ్యాన కేంద్రం విజయవాడ సిటీ కోఆర్డినేటర్‌ పురుషోత్త్తపట్నం విజయలక్ష్మి మాట్లాడుతూ ఈనెల 19, 20,21 తేదీల్లో విజయవాడ నగరంలోని కృష్ణలంక (పచ్చమేడబజారు)లో ఉచిత ధ్యాన తరగతులు నిర్వహించనున్నామన్నారు. 22న విజయవాడ నగరంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి 100వ జన్మదిన వేడుకలు (శతజయంతి ఉత్సవాలు) వైభవపేతంగా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సుగ్గుల శ్రీనివాసరావు, మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.