May 05,2023 22:41

maggiga pampini chestunna nirvahakulu

2000 మందికి మజ్జిగ పంపిణీ
ప్రజాశక్తి-కోడూరు
కోడూరు మండల పరిధిలోని మందపాకల గ్రామంలోని శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన బాసు సీతారామస్వామి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్‌ నిర్వాహకులు జనసేన పార్టీ మండల కార్యదర్శి బాసు శివప్రసాద్‌ ఆధ్వర్యంలో 2000 మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. మజ్జిగ పంపిణీని కృష్ణాజిల్లా జనసేన పార్టీ లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రికుల భక్తుల కోసం మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు బాసు శివప్రసాద్‌ మాట్లాడుతూ శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కూడా భక్తులకు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్టలంక గ్రామ సర్పంచ్‌ కనకాల వెంకటేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు తోట సోమశేఖర రావు, పార్టీ నాయకులు కోట రాంబాబు, మేక వీరబాబు, తో పాటు బాసు బాల సూర్యప్రసాద్‌, బాసు కిరణ్‌ కుమార్‌, బాసు మధు శంకర్‌, గాదె సుబ్రహ్మణ్యం, గాదె శ్రీరామ్‌,కడవకొల్లు సత్యనారాయణ, కడవకొల్లు శ్రీను (చిన్నయ్య) తోపాటు పలువురు పాల్గొన్నారు.