ఏలూరు : కామవరపుకోటలో నూతన గిరిజన మండల కమిటీ బుధవారం ఏర్పాటైంది. ఎపి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని కామవరపు కోట మండలం కొండగూడెంలో ఏర్పాటు చేశారు. మండల కమిటీ అధ్యక్షులు అంక్యం రాంబాబు, కార్యదర్శి గోధుమ మధు, డిక్కీ ఏసు, మునుగుల నరసింహమూర్తి, నల్లమొద్దు ప్రభాకర్ రావు, బొగ్గు సుబ్బారాజు, గోధుమ భారతి, జల్లి కృష్ణ 20 మందితో మండల కమిటీ ఏర్పడింది. ఈ సమావేశంలో తాటిచెర్ల, కొత్తగూడెం, గొల్లగూడెం, తదితర గ్రామాల నుంచి గిరిజనులు పాల్గొన్నారు. కామవరపుకోట మండలంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై నూతన కమిటీ నిరంతరం పనిచేస్తుందని నూతన అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. అలాగే కామవరపుకోట మండలంలో వందలాది సంవత్సరాలుగా నివసిస్తున్న నాయక్ కులస్తులకు 2019లో నిలిచిపోయిన ఎస్‌టి సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని తదితర సమస్యలపైన ఈ కమిటీ చర్చించింది. ప్రభుత్వం మండలంలో సమస్యల్ని పరిష్కరించాలని కమిటీ కోరింది.










