Oct 30,2023 20:28

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - దేవనకొండ
నవంబర్‌ 1, 2, 3న డివైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని డివైఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాయుడు, శ్రీనివాసులు తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. డివైఎఫ్‌ఐ నేడు దేశంలోనే 2.10 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద యువజన సంఘంగా ఎదిగిందని తెలిపారు. యువతకు ఉపాధి కావాలంటూ అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించినట్లు చెప్పారు. డివైఎఫ్‌ఐ నాయకులు మధు, చిన్న, అశోక్‌ పాల్గొన్నారు.