Jun 20,2023 12:18

సాంబ /జమ్ము : జమ్మూ కాశ్మీర్‌లోని సాంబ జిల్లాలో బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా 19 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన సమోత్రా చన్ని ప్రాంతంలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి పోలీసులు, స్థానికులు చేరుకుని బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఘాగ్వాల్‌ ట్రుమా ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది క్షతగాత్రులని సమీపంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తరలించినట్లు జమ్మూ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కూలీలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీరంతా కాశ్మీర్‌లోని ఓ ఇటుకబట్టీలో పనిచేందుకు బస్సులో బయల్దేరారు. ప్రమాదవశాత్తూ ఈ బస్సు బోల్తా పడిందని అధికారులు తెలిపారు.