పుట్టపర్తి అర్బన్ : సత్యసాయి జిల్లాలో ఈబీసీ నేస్తం పథకం కింద 16,462 మంది లబ్ధిదారులకు 24.70 కోట్లు లబ్ధి చేకూరిందని కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం పథకం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పుట్టపర్తి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ ఈబీసీ ద్వారా ఒక్కొక్కరికి 15 వేలు ప్రకారం రెండవ విడత కింద నిధులు మంజూరు చేశారన్నారు. జిల్లాలో మొదట విడతలో రూ.24.04 కోట్లు మంజూరు కాగా రెండో విడతలో రూ.24.70 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. అనంతరం కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఓబుళపతి, వైస్ ఛైర్మన్లు శ్రీలక్ష్మి, తిప్పన్న, పుడా ఛైర్‌పర్సన్ లక్ష్మీనరసమ్మ, బీసీ కార్పొరేషన్ ఎఇఒ ఆర్.విజయలక్ష్మి, మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు.










