మాట్లాడుతున్న ఎఒ హేమలత
ప్రజాశక్తి - గోనెగండ్ల
ఈనెల 15లోపు పంట నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఎమ్మిగనూరు ఎడిఎ ఖాద్రీ, ఎఒ హేమలత తెలిపారు. శుక్రవారం గోనెగండ్లలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ సలహా సమావేశం నిర్వహించారు. ఎమ్మిగనూరు ఎడిఎ ఖాద్రీ, ఎఒ హేమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈనెల 15లోపు రైతులందరూ పంటల నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈకేవైసీని కూడా స్థానిక సచివాలయంలో వ్యవసాయ సహాయకుని సంప్రదించి చేసుకోవాలని చెప్పారు. డ్రోన్లను కూడా ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం మండలంలోని పుట్టపాశం, వెముగోడు, తిప్పనూరు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల ఎరువులు ఆర్‌బికెలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










