Aug 11,2023 20:56

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 14న చేపట్టే 'జనజాగరణ' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో రైతుసంఘం, వ్యకాస, సిఐటియు సమావేశం సిఐటియు మండల కార్యదర్శి బి.వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులను, కూలీలను, కార్మికులను విస్మరించి బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తోందని తెలిపారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతుసంఘం, సిఐటియు, వ్యకాస ఆధ్వర్యంలో ఈనెల 14న దేశవ్యాప్తంగా 'జన జాగరణ'ను గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్నట్లు చెప్పారు. జయప్రదం చేయాలని కోరారు. రైతుసంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, సిఐటియు మండల అధ్యక్షులు జె.రామాంజనేయులు, రైతు సంఘం మండల నాయకులు బాష, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి దస్తగిరి బాషా, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ మండల కార్యదర్శి వీరేష్‌, సిఐటియు నాయకులు ఉరుకుందు, ఏలియా పాల్గొన్నారు.