14 నుంచి ప్రచార ఆందోళనలు : సిపిఐ
ప్రజాశక్తి -మొవ్వ
'బిజెపి హఠావో దేశ్ బచావో' నినాదంతో ఈనెల 14 నుంచి 30వ తారీకు వరకు సిపిఐ, సిపిఎం పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా సంయుక్తంగా నిర్వహించే ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే వి వి ప్రసాద్ పిలుపునిచ్చారు. మొవ్వ మండలం కూచిపూడి-పెదపూడి సెంటర్‌లోని సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 14న జిల్లా కేంద్రాల్లో ప్రచార ఆందోళనా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా ఇన్చార్జి కార్యదర్శి టి.తాతయ్య, మాలంపాటి కాంచన రావు, వెలగపూడి అజాద్, మల్లు పెద్ది రత్నకుమారి, అడ్డాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










