Sep 08,2023 19:38

కరపత్రాన్ని విడుదల చేస్తున్న సిఇఒ తిరుమలరెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలోని రావుస్‌ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న నిర్వహించే మెగా జాబ్‌ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రావుస్‌ కళాశాల సిఇఒ తిరుమల రెడ్డి కోరారు. శుక్రవారం మెగా జాబ్‌ మేళాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిరుద్యోగ యువత కోసం చేపట్టిన ఉద్యోగ యజ్ఞం స్ఫూర్తిగా రావుస్‌ కళాశాలలో ఎపి ఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన 25 బహుళ జాతీయ కంపెనీలతో మెగా జాబ్‌ మేళా నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. రావుస్‌ కళాశాల ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని మెగా జాబ్‌మేళా నిర్వహిస్తునట్లు తెలిపారు. రావుస్‌లో నిర్వహించే జాబ్‌మేళాకు ఎమ్మిగనూరు పట్టణ, పరిసర ప్రాంతాల నిరుద్యోగులు, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈనెల 11లోపు షషష.Aజూరరసష.ఱఅ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లు 9988853335, 779921656, 9985496587, 8885904099కు సంప్రదించాలని కోరారు. ఎపి ఎస్‌ఎస్‌డిసి ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ సాయి తేజ, కోఆర్డినేటర్‌ నరసప్ప పాల్గొన్నారు.