Aug 06,2023 22:59

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 12న చేపట్టనున్న 12గంటల ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాప్టో కష్ణాజిల్లా శాఖ పిలుపు నిచ్చింది. ఫ్యాప్టో జిల్లా శాఖ సన్నాహక సమావేశం ఆదివారం స్థానిక యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయం లో జిల్లా చైర్మన్‌ బి.లంకేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగే ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం బి. లంకేష్‌ మాట్లాడుతూ పాఠశాల విద్యారంగ పరిరక్షణ కోసం మరియు పాత పెన్షన్‌ పునరుద్ధరణ కోరుతూ జరిగే ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా విజయవంతానికి ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ కషి చేయాల్సిందిగా తీర్మానించారు.ఈ సమావేశంలో ప్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్‌ అశోక్‌ కుమార్‌ , కో చైర్మన్‌ బి.కనకారావు , యు టి ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లెనిన్‌ బాబు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.