ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : కృష్ణాజిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఈవో తహెరా సుల్తానా తెలిపారు.:డిఈవో కార్యాలయంలో శుక్రవారం డిఈవో పాత్రికేయుల సమావేశం నిర్వహించి పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు వివరించారు. జిల్లాలో 391 ఉన్నత పాఠశాలలకు చెందిన మొత్తం 22,436 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వీరిలో 12,048 మంది బాలురు, 10,388 మంది బాలికలు. వీరిలో 19,935 మంది రెగ్యులర్, 2,501 మంది ప్రయివేట్ అభ్యర్థులు, జిల్లా వ్యాప్తంగా 143 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 143 మంది చీఫ్ సూపరింటెండెర్లు, 143 మంది డిపార్టుమెంటల్ అధికారులను నియమించామని తెలిపారు. ఏప్రిల్ నెల 3వ తేది నుంచి 18వ తేది వరకు పదో తరగతి. -పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9.30 గంటల నుంచి మ. 12.45 గంటల వరకు నిర్వహిస్తారని అన్నారు. పరీక్షల మెటీరియల్ రవాణాకు 10 రూట్లు ఏర్పాటు చేసి 10 మంది రూట్ అధికారులు మరో 10 మంది అదనపు రూట్ అధికారులను నియమించామన్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంట్ మాల్ ప్రాక్టీస్, మాస్ కాపింగ్ కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు డిఈవో తెలిపారు. జిల్లాలో 4 హైరిస్క్ పరీక్ష కేంద్రాలుగా గుర్తించినట్లు వాటి వివరాలు గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి, ర్ ఘంటసాల మండలం శ్రీకాకుళం, కంకిపాడు మండలం పునాదిపాడులలో జడ్ పి హైస్కూళ్లలో సిసి కెమోరాలు ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు, కంట్రోల్ రూం పోన్ నెంబర్లు 9848530928, 9848232601, 9966753718 తెలిపారు. వేసవి కావున వడదెబ్బ లేదా అవాంఛనీయ సం ఘటనలు నివారణకు అవసరమైన మెడికల్ కిట్స్ సిద్ధంగా ఉంచడంతో పాటు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నాలుగైదు పాఠశాలలకు ఒక్కొ మెబైల్ వ్యాన్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.మంచి ఫలితాలు సాధించుటకు విద్యార్ధులకు ముందుగా ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది, పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులతో సహా ఎవ్వరూ మెబైల్ ఫోన్సు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకూడదని, ప్రతి పరీక్ష కేంద్రం మెబైల్ ఫ్రీ జోన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఐడి కార్డులు జారీ చేశామన్నారు. విధులు కేటాయించిన సిబ్బంది తప్ప త్రాగునీరు, తేనీరు సరఫరా కోసం ఎవ్వరికి అనుమతి లేదని తెలిపారు.పరీక్షల నిర్వహణలో వదంతులు నమ్మవద్దని, పరీక్షలు సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అసిస్టెంట్ కమీషనర్ ఆప్ ఎగ్జామ్స్ డెవిడ్ రాజు పాల్గొన్నారు.










