ప్రజాశక్తి-ఘంటసాల : అగ్నిప్రమాదంలో ఇంటితో సహా సర్వం కోల్పోయిన ఆటో డ్రైవర్ కొడాలి వెంకటేశ్వర రావు కుటుంబానికి వైసీపీ నేతలు ఆర్థిక సాయం చేశారు. ఘంటసాల మండలం దేవరకోట ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు - చిన్ని దంపతులు ఇరువురు కుమారులతో కలసి ఒంటి నిట్టాడి ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో వెంకటేశ్వరరావు ఇల్లు కాలిపోవడంతో కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. విషయం తెలుసుకున్న ఘంటసాల మండలం వైసీపీ ఎస్సీ, బీసీ నేతలు స్పందించి బాధితులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి పక్కా గృహం మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన వెంకటేశ్వరరావు కుటుంబానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని కోరారు. ఆర్థిక సాయం చేసిన వారిలో వైస్ ఎంపీపీ కుంపటి నాగేంద్రబాబు, చిట్టూర్పు, ఘంటసాల, దేవరకోట, ఘంటసాలపాలెం, కొడాలి ఎంపీటీసీలు కొడాలి నాగార్జున, దిరిశం వెంకట లక్ష్మీ, కొప్పుల రాములమ్మ, కొల్లూరి విజయ, కొండేటి నీలవేణి, తెలుగురావుపాలెం సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు, వైసీపీ మండల కార్యదర్శి దిరిశం పిచ్చేశ్వరరావు, పార్టీ నేతలు కుంపటి శరత్ బాబు, చిట్టూరి రమేష్, దోనే వెంకటేశ్వరరావు, పడమట వీర కుమార్, మునిపల్లి బుజ్జి ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల మునేశ్వరరావు, కొడాలి యువరాజు, దిరిశం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.










