Oct 12,2023 17:32

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిర్ణయించారు. పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారు. పార్టీ బీఫామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు. '' పాలేరుతోపాటు మరోచోట పోటీ చేయాలనే డిమాండ్‌ ఉంది. అనిల్‌, విజయమ్మను కూడా పోటీ చేయించాలని డిమాండ్‌ ఉంది. అవసరమైతే వారిద్దరూ పోటీ చేస్తారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే కేసీఅర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారేమో అనుకున్నాం. అందుకే కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం. 4 నెలలు ఎదురు చూశాం. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకువస్తాం'' అని షర్మిల తెలిపారు.