Nov 04,2023 16:17

అమరావతి: తెలంగాణలో టిడిపి పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతిస్తోందని కొడాలి నాని ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎన్నికల బరిలోకి దింపవద్దని చంద్రబాబు చేసిన నిర్ణయానికి కారణం ఏమిటో స్వయంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వివరించారు.. ఈ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తోందని చంద్రబాబు స్పష్టం చేయటం వల్లే.. తాను ఇక టీడీపీలో ఉండనని కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటించాడు.. అంటే దీని అర్థం ఏమిటి?.. కాంగ్రెస్‌ వెనుక, కాంగ్రెస్‌ తోనూ ఉన్నది చంద్రబాబేనని స్పష్టంగా కనిపిస్తోంది అని కొడాలి నాని వెల్లడించారు.తెలంగాణలో కాంగ్రెస్‌ తో, బీఆర్‌ఎస్‌ తో పోరాడుతున్నామని అంటున్న బీజేపీకి కాకుండా, పురంధేశ్వరి టీడీపీకి మద్దతు ఇస్తోంది.. టీడీపీ అంటే కాంగ్రెసే కదా?.. మరి, పురంధేశ్వరి కాంగ్రెస్‌ లో ఉన్నట్టా..? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలి అని ఆయన తెలిపారు. ఆమె టీడీపీలో ఉండి ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచింది.. కాంగ్రెస్‌ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోగానే వారినీ వదిలేసి బయటకు వచ్చింది.. బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరింది.. మరి పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నట్టా.. లేనట్టా?.. అని మాజీ మంత్రి కొడాలి నాని అడిగారు.