డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబియాకు ఝలక్
బెర్లిన్: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత మహిళా ఆర్చర్లు సత్తా చాటారు. బుధవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబియాకు ఝలక్ ఇచ్చి ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్ విభాగం సెమీస్‌లో జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామిలతో కూడిన త్రయం 220-216పాయింట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబియాపై సంచలన విజయం సాధించారు. ఇక కాంపౌండ్ పురుషుల, మిక్స్‌డ్ విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో అభిషేక్ వర్మ, ఓఝాస్, ప్రథమేశ్‌లతో కూడిన భారతజట్టు 230ా235పాయింట్ల తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలైంది. ఇక మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో డియెటలేాజ్యోతి సురేఖలతో కూడిన జట్టు 154ా153పాయింట్ల తేడాతో అమెరికా చేతిలో ఓడి పతక రేసునుంచి నిష్క్రమించింది.










