ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ
టైటిల్‌కై మలేషియాతో డీ
చెన్నై: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్లోకి భారతజట్టు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారతజట్టు 3-0గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది. రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగిన సెమీస్‌లో తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. రెండో క్వార్టర్ 19వ ని.లో హార్దిక్‌ాసుమిత్ బంతిని నిలువరిస్తూ.. ఆకాశ్‌దీప్‌కు గోల్‌పోస్టువద్ద బంతిని అందిచడంలో భారత్ 1-0 ఆధిక్యతలో నిలిచింది. 23వ ని.లో పెనాల్టీని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో భారత్ 2ా0 ఆధిక్యతలో నిలిచింది. ఇక రెండో క్వార్టర్ ముగియడానికి కొద్ది సెకన్ల ముందు 30వ ని.లో మన్‌దీప్ సింగ్ మరో గోల్ చేశాడు. భారత్‌కు లభించిన మూడు గోల్స్ రెండో క్వార్టర్‌లోనే రావడం విశేషం. లీగ్ దశలో భారతజట్టు జపాన్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్నా.. ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించడం విశేషం. మరో సెమీస్‌లో మలేషియా జట్టు 6-2గోల్స్ తేడాతో కొరియాను చిత్తుచేసింది. తొలి క్వార్టర్‌ముగిసే సరికి ఇరుజట్లు 2-2గోల్స్‌తో సమంగా ఉన్నాయి. 2వ క్వార్టర్‌లో మలేషియా రెండు, నాల్గో క్వార్టర్‌లో మరో రెండు గోల్స్ చేసి మలేషియా జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు 2వ స్థానంలో నిలిచిన మలేషియాతో తలపడనుంది.










