Aug 03,2023 22:10

ప్రి క్వార్టర్స్‌కు కొలంబియా, మొరాకో
ముగిసిన ఫిఫా మహిళల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ పోటీలు
మెల్‌బోర్న్‌: రెండుసార్లు ఛాంపియన్‌ జర్మనీ జట్టు ఈసారి లీగ్‌ దశను దాటలేకపోయింది. గురువారం జరిగిన గ్రూప్‌-హెచ్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో జర్మనీ-దక్షిణ కొరియా టజప్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌ 1-1గోల్స్‌తో డ్రా అయ్యింది. దీంతో జర్మనీ జట్టు ఈ గ్రూప్‌లో 4పాయింట్లతో 4వ స్థానంలో నిలువగా.. మరో మ్యాచ్‌లో మొరాకో జట్టు గ్రూప్‌ టాపర్‌ కొలంబియాపై 1-0తో గెలిచి నాకౌట్‌కు చేరింది. మొరాకో తరఫున ఏకైక గోల్‌ను అనిస్స లహ్మరీ తొలి అర్ధభాగం ఇంజూరీ సమయంలో చేసింది. ప్రి క్వార్టర్‌ఫైనల్‌ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రి క్వార్టర్‌ఫైనల్స్‌..
5(శని) : స్విట్జర్లాండ్‌ × స్పెయిన్‌ (ఉ.10.30గం||లకు)
జపాన్‌ × నార్వే(మ.1.30గం||లకు)
6(ఆది) : నెదర్లాండ్స్‌ × దక్షిణాఫ్రికా(ఉ.7.30గం||లకు)
స్వీడన్‌ × అమెరికా(మ.2.30గం||లకు)
7(సోమ): ఇంగ్లండ్‌ × నైజీరియా(మ.1.00గం||కు)
ఆస్ట్రేలియా × డెన్మార్క్‌(సా.4.00గం||లకు)
8(మంగళ): కొలంబియా × జమైకా(మ.1.30గం||లకు)
ఫ్రాన్స్‌ × మొరాకో(సా.4.30గం||లకు)