తొలిసారి ప్రపంచకప్ సెమీస్‌కు
16న ఇంగ్లండ్‌తో డీ
సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి తొలిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోటీలో నిర్ణీత, అదనపు సమయం పూర్తయ్యే సరికి ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. అనంతరం పెనాల్టీ షూటౌట్‌లో తొలి ఐదు గోల్స్‌ను ఇరుజట్లు చేయడంతో షూట్ ఆఫ్‌ను నిర్దేశించగా.. ఆస్ట్రేలియా 7-6తో గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. యువ ఫుట్‌బాలర్ విక్కీ బెచో గోల్ కొట్టడంతో ఆసీస్ జట్టు సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సుమారు 75,784మంది ప్రేక్షకులు హాజరుకావడం విశేషం.
ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ గెలుపు..
ఇంగ్లండ్-కొలంబియా జట్ల మధ్య జరిగిన నాల్గో, చివరి క్వార్టర్‌ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు కొలంబియాకు ఝలక్ ఇచ్చింది. కొలంబియా తరఫున తొలి గోల్‌ను లెయిసీ సాంటోస్(44వ ని.) చేసినా.. ఇంగ్లండ్ క్రీడాకారిణి లారెన్ హెంప్ తొలి అర్ధభాగం అదనపు సమయం(45+6వ ని.) చేసింది. దీంతో అర్ధభాగం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. రెండో అర్ధభాగం 63వ ని.లో రూసో గోల్ చేయగా.. ఆ తర్వాత కొలంబియా చేసిన దాడులను ఇంగ్లండ్ డిఫెండర్లు సమర్ధవంతంగా నిలువరించారు. దీంతో ఇంగ్లండ్ జట్టు మూడోసారి ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌కు చేరిన నాలుగుజట్లు టాప్-10లో ఉన్న జట్లే కావడం విశేషం. స్వీడన్(3), స్పెయిన్(6), ఆస్ట్రేలియా(10)వ స్థానాల్లో ఉన్నాయి. 16న(బుధవారం) జరిగే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనుంది. 15న (మంగళవారం) స్పెయిన్-స్వీడన్ జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్ జరగనుంది.










