బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్ ఎంపికయ్యాడు. క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్‌తోపాటు సహాయ సిబ్బంది, కోచ్ సంజరు బంగర్‌ల పదవీకాలం కూడా ముగిసింది. వీరందరి పదవీకాలం పొడిగింపబడలేదని, ఆండీ ఫ్లవర్‌కు హెడ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు ఆ ఫ్రాంచైజీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.










