Aug 04,2023 22:22

లండన్‌: ఇంగ్లండ్‌ విధ్వంసక ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన అతను ఈరోజుతో మూడు ఫార్మాట్లకు ముగింపు పలికాడు. దాంతో, అతడి 12 ఏళ్ల కెరీర్‌ ముగిసింది. అలెక్స్‌ ఇకపై ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. నిరుడు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టులో అలెక్స్‌ సభ్యుడు. విధ్వంసక ఆటగాడిగా పేరొందిన అలెక్స్‌ హేల్స్‌ 2011లో భారత్‌పై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. పొట్టి క్రికెట్‌లో సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అలెక్స్‌ ఆ తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే.. టీ20ల్లోనే బాగా సక్సెస్‌ అయ్యాడు. కొన్ని రోజులు ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌ నంబర్‌ 1 బ్యాటర్‌గా కొనసాగాడు. 2022 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లంలో అలెక్స్‌ కీలకపాత్ర పోషించాడు. భారత జట్టుతో జరిగిన సెమీఫైనల్లో 86 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఇంగ్లండ్‌ తరఫున 75 టీ20లు, 70 వన్డేలు, 11టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.