ప్రజాశక్తి- దేవనకొండ :మండలంలో ఎరువుల పురుగుమందుల విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి విక్రయాలు జరిగితే చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు హెచ్చరించారు. గురువారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో పెస్టిసైడ్స్ మరియు ఫర్టిలైజర్స్ డీలర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు రైతులకు అమ్మిన వాటికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుప రాదన్నారు. స్టాక్ పాయింట్ కు కచ్చితంగా గోడౌన్ అనుమతి ఉండాలన్నారు. నిబంధనలకు లోబడి దుకాణాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల డీలర్స్ పాల్గన్నారు.










