Jul 16,2023 21:24
  • మళ్లీ పతకాలు సాధించిన జ్యోతి, పారుల్‌

బ్యాంకాక్‌: ఆసియా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మహిళల షాట్‌పుట్‌లో అభా ఖత్వా జాతీయ రికార్డును సమం చేసి రజిత పతకం కైవసం చేసుకోగా.. 200మీ. పరుగులో జ్యోతి యర్రాజి, 5వేల మీటర్ల లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌లో పారుల్‌ చౌదరి రజిత మరో పతకాలను సాధించారు. ఇంతకుముందు జ్యోతి యర్రాజి 200మీ. పరుగులో రజితం, 3వేల మీటర్ల పరుగులో చౌదరి స్వర్ణ పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మహిళల షాట్‌పుట్‌లో అభా ఖత్వా గుండును 18.06మీ. విసిరి జాతీయ రికార్డును సమం చేసింది. 28ఏళ్ల ఖత్వా తొలి ప్రయత్నంలో 17.13మీ. రెండో ప్రయత్నంలో 17.10మీ., మూడో, చివరి ప్రయత్నంలో ఏకంగా 18.06మీ. గుండును విసిరి రజిత పతకం ఖాయం చేసుకుంది. గతంలో షాట్‌పుట్‌ రికార్డు నెలకొల్పిన మన్‌ప్రీత్‌ కౌర్‌ 17.00మీ. కాంస్యపతకంతో సరిపుచ్చుకుంది. చైనాకు చెందిన జియాహుయాన్‌(18.88మీ.) స్వర్ణ పతకం కైవసం చేసుకోంది.