సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
విజయవాడ కమాండ్ కంట్రోల్ ఐటి, సైబర్ విభాగం ఎస్‌ఐ వాసిరెడ్డి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-జంక్షన్ (గన్నవరం)
బాపులపాడు వీరవల్లీ వాణీ విద్యానికేతన్ 34వ వార్షికోత్సవ సంబరాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు విజయవాడ కమాండ్ కంట్రోల్ ,ఐటి , సైబర్ విభాగం ఎస్ ఐ వాసిరెడ్డి శ్రీనివాసరావు , గ్రామ సర్పంచ్ పిల్లా అనిత రామారావు ప్రముఖులు గుండపనేని ఉమావరప్రసాద్, నందమూరి కృష్ణప్రసాద్, కోడేబోయిన బాబీ, ప్రిన్సిపాల్ నందిగం రవికుమార్ పాల్గొన్నారు. ముఖ్య అతిధులు జ్యోతిప్రజల్వన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. విచ్చేసిన అహుతులు, విద్యార్థుల తల్లిదండ్రులకు నందిగం రమాసులోచన వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం పిన్సిపాల్ నందిగం రవికుమార్ మాట్లాడారు. 34 ఏళ్ల క్రితం చిన్నగా ప్రారంభమైన పాఠశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఎంతో మంది భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాని వెల్లడించారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండల ఫస్ట్ మార్కులు సాధించిన కె.భువనేశ్వరి 586/600, కె. ధనశ్రీ 580/600, ఎం.సంతోష్ 576 /600, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ విద్యా సంవత్సరంలో వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్ధులు బహుమతులు అందజేశారు. వీరవల్లి గ్రామంలో వాణి స్కూల్ ఏర్పాటు చేసి భావితరాలు భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యావ్యాప్తికి నందగం రవికుమార్ మాష్టార్ విశేషమైన కషి చేస్తున్నారని సర్పంచ్ పిల్లా అనితా రామారావు కొనియాడారు. విద్యార్థులు వేసవి శెలవులను సద్వినియోగం చేసుకోవాలని స్మార్ట్ ఫోన్లు అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలని మాజీ సర్పంచ్ నందమూరి కృష్ణప్రసాద్ అన్నారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ , ఐటి, సైబర్ విభాగం ఎస్ ఐ వాసిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడితే సమయం దుర్వినియోగమవుతుందన్నారు. చెడు అంశాలకు బానిస అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. సైబర్ నేరాల పట్ల కూడా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు










