ప్రజాశక్తి-కోడూరు : సుదూర ప్రాంతల నుంచి హంసలదివి బీచ్ వద్దకు ఆదివారం భక్తులు, విహారయాత్రలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక వాహనాలలో వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. పాలకాయతిప్ప కరకట్ట వద్ద గల బీచ్ ఎంట్రన్స్ గేటు దగ్గర మెరైన్ పోలీసులు, కోడూరు పోలీసులు, అటవీశాఖ అధికారులు బందో బస్తు ఏర్పాటు చేసి అనుమానం కలిగిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి బీచ్ వద్దకు అనుమతి ఇచ్చారు. భక్తులు, పర్యాటకులు సముద్రంలో స్నానాలు ఆచరించేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మెరైన్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల లో భాగంగా మైక్ లతో అనౌన్స్ చేస్తూ వారికి అవగాహన కల్పించారు. మెరైన్ పోలీసులు తీరం వెంట గ్గస్తి నిర్వహించి బీచ్ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.










