ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మొదటి స్థానం
ప్రజాశక్తి-అవనిగడ్డ
రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మొదటి స్థానం లభించింది.ఆ పాఠశాలకు చెందిన ఏ ప్రేమ్ సాయి 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి చరిత్ర సృష్టించాడు.ఆ పాఠశాల నుండి 550 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 8 మంది ఉండగా 500 మార్కులకు పైగా సాధించిన 41 మంది విద్యార్థులు 450 మార్కులకు పైగా సాధించిన వారు 59 మంది, 400 మార్కులకు పైగా సాధించిన వారు 81 మంది ఉన్నారు. జిల్లాలోని అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలగా అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిలబడిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ.పద్మ రాణి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా 592 మార్కులు సాధించిన విద్యార్థి ప్రేమ్ సాయి తండ్రి శ్రీనివాసును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో పాటు ఇన్చార్జి హెచ్‌ఎం జిబిఎన్ గోపాల్, పిడి భాను ప్రకాష్ అభినందించారు.










