Apr 18,2023 22:37

kambapu rambabu


పేదల సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యం
రెడ్డిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంబపు రాంబాబు
ప్రజాశక్తి-పమిడిముక్కల
రాష్ట్రంలోని అన్ని తరగతుల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రెడ్డిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంబపు రాంబాబు చెప్పారు. ఆయన ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం దేశంలోనేకాదు ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘనతగా నిలుస్తుందని చెప్పారు. ఇళ్ల లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓ వరమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు పేదల ఇళ్లకు కేవలం'నివసించే హక్కులు ' మాత్రమే ఇచ్చాయిని, ఆ ఇంటి విలువ రూ.2 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఉన్నప్పటికీ ఇల్లు, ఇంటి స్థలాన్ని అమ్ముకునే స్వేచ్ఛ ఉండేది కాదన్నారు. ఆ ఆస్తి మీద సర్వహక్కులు పొందలేని దుస్థితి ఉండేదన్నారు. ఈ నేపథ్యంలో కేవలం నామమాత్రపు రుసుముతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేదల రుణాలు, వడ్డీలు అన్నీ మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌ ఉచితంగా చేయిస్తూ వారి ఇంటిపై వారికి పూర్తి హక్కులు కల్పించి లబ్ధిదారులకు ఓటీఎస్‌ పట్టాలు ఇవ్వడం ఒక విప్లవాత్మకమైన చర్యని కొనియాడారు. నవరత్న పథకాల పథకాల ద్వారా సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్‌ పామర్రు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. పమిడిముక్కల మండల పరిషత్‌ అధ్యక్షురాలు కాసాని వేదసుప్రజ, పమిడిముక్కల జెడ్పీటీసీ సభ్యురాలు యేనుగు వెంకటరమణకుమారి, వైసిపి నాయకులు మండలంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధ్యాన్యత ఇస్తున్నారన్నారు.