chekku estunna collector
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
ప్రజాశక్తి-పమిడిముక్కల
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉందనిహనుమంతపురం గ్రామ సర్పంచ్ కలపాల రాంబాబు అన్నారు. మండలంలోని మంటాడ, హనుమంతపురం గ్రామాల్లో ఈనెల 25న చేపట్టనున్న ఆసరా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. డాక్రా మహిళలు మరింతగా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి సిఎం కృషిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొడమంచిలి మహేష్, రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్ కంబపు రాంబాబు, దారపు రమాదేవి, మునిపల్లి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.










