కూలిన వంతెనను పరిశీలించిన రమేష్‌బాబు
ప్రజాశక్తి-కోడూరు
కోడూరు శివారు నరసింహపురం గ్రామ సమీపంలో లింగన్నకోడుపై కూలిన వంతెనను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం వంతెన పునర్నిర్మాణం చేపట్టేందుకు కావాల్సిన నిధుల కోసం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రబాబు, మోపిదేవి వెంకటరమణతో మాట్లాడి కొంత నిధులు సేకరించి ,వాటితో ఎమ్మెల్యే నిధులను జతపరిచి వంతెన పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారని నరసింహాపురం గ్రామానికి చెందిన దోనేపూడి విజరు కుమార్,(చిట్టి అబ్బాయి) తెలిపారు. దీనికి సంబంధించి డ్రైనేజీ అధికారులతో మాట్లాడి రూ.43.50 లక్షలతో అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నరసింహపురం గ్రామస్తులు ఉన్నారు.










