జిల్లావ్యాప్తంగా రంజాన్ వేడుకలు
ప్రజాశక్తి-యంత్రాంగం
రంజాన్ పండుగను జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మసీదులను సందర్శించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. గన్నవరం : ముస్తాబాదలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మస్జిద్ ఇమామ్ హఫీజ్ హాసీన్ ఇక్బాల్ సందేశం ఇచ్చారు. ముస్తాబాద, సూరంపల్లి, సవారిగూడెం,కొండ పావులూరు, పురుషోత్తపట్నం, సూరంపల్లి ఇండిస్టియల్ ఏరియా నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పాట్లను జామియా మస్జిద్ కమిటీ వారు పర్యవేక్షించారు. పెనమలూరు :
పెనమలూరు మండలం కానూరు సనత్ నగర్‌లోని మస్జీద్ ముబారక్ ఆధ్వర్యంలో కానూరు పిన్నమనేని టీచర్స్ కాలనీ పంట కాలువ రోడ్డు లోని ఎగ్జిబిషిన్ గ్రౌండ్‌లో నమాజ్ జరిగింది. వైసిపి ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ సిద్ధిక్ మాట్లాడారు. గుడ్లవల్లేరు : మండలంలోని కవుతరం, వేమవరం, డోకిపర్రు, అంగలూరు, పెంజెండ్ర, ఉలవలపూడి, కట్టవాని చెరువు, సుబ్బి చెరువు గ్రామాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), కృష్ణాజిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, టిడిపి సీనియర్ నాయకులు వెనిగండ్ల రాము, ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడ : ఈద్-ఉల్-పితర్ (రంజాన్)ను పట్టణంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. స్థానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా గల గుల్జార్ చౌక్ మసీదు, బంటుమిల్లిరోడ్‌లోని మియాఖాన్ మసీదు, షాహీ మసీదు, నైజాంపేట, గుంటూరు మహల్లా, ముబారక్ సెంటర్, కార్మికనగర్, రూరల్ మండలంలోని కొత్త మల్లాయిపాలెం, పాత మల్లాయిపాలెం, తదితర ప్రాంతాలలో ముస్లింలు ఇమామ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు 2.5కిలోల గోధుములు, రూ.56లు పితర్ (వితరణ)గా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమలలో పలువురు నాయకులు, పార్టీల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. స్థానిక ముబారక్ హోటల్ సెంటర్లో జనసేన నాయకుడు మాచర్ల రామకృష్ణ(ఆర్.కె) ఆధ్వర్యంలో తోఫా, చీరలు అందజేశారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆశీస్సులతో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గుడివాడ పట్టణంలోని పలువురు ముస్లిం సోదరీమణులకు రంజాన్ కానుకగా చీరలు అందజేశామన్నారు. జనసేన నాయకులు షేక్ మీరాషరీఫ్, అరుణ, నూనె అయ్యప్ప, గంట అంజి, దివిలి సురేష్, పందిళ్ళ శీను, నాగసాయి, చరణ్, శివ, జననాయకుల పాల్గొన్నారు. టిడిపి నాయకుడు వెనిగండ్ల పౌండేషన్ అధినేత వెనిగండ్ల రాము అధ్వర్యంలో శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 6 వేల ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉయ్యూరు: ఉయ్యూరులోని దయార మసీదు, జామియా మసీదు, చిన్నమసీదు, కేసీపీ సమీపాన మసీదు, రాజేంద్ర నగర్ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెదపారుపూడి : మండలంలోని వెంట్రప్రగడ, లక్ష్మీపురం, కొర్నిపాడు గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. షేక్ బాజీ, షేక్ బాబ్జి, సర్దార్, భాష, చోటే ,సమీర్ ,నజీర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
మొవ్వ : మొవ్వ మండలంలోని మసీదులలో మత ప్రవక్తలు బోధనలు చేశారు. పేదలకు తమశక్తి మేరకు దానధర్మాలు నిర్వహించారు. పెదపూడి మసీదులో చిన్నారులు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. పమిడిముక్కల : జిల్లాలోని ముస్లిం సోదరులకు పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పమిడిముక్కల మండలంలోని అల్లీనాకిపాలెం, మేడూరు, గురజాడ, పత్తేలంక, కపిలేశ్వరపురం, వీరంకిలాకు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అలీనాకిపాలెంలో గాజిర్ సొసైటీ ఉత్తరప్రదేశ్ వారు మౌలానా సయ్యద్ హూ ఇస్ థిస్ రాజా గురువు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పమిడిముక్కల మండల అధ్యక్షులు యలమంచిలి గణేష్, నాయకులు అక్కినేని సతీష్, మేడూరు గ్రామ సర్పంచ్ గొరిగిపూడి స్వర్ణలత, అగినపర్రు కోపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు అక్కినేని సతీష్, కో ఆప్షన్ సభ్యులు మీర్జా దినాయత్ ఆలీ, ఎంపీటీసీ సభ్యులు సాజిద్ ఆలీ, టిడిపి నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అవనిగడ్డ : స్థానిక ఏడోవార్డులోని మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. టిడిపి మైనార్టీ విభాగం నాయకులు షేక్ బాబావలి, మొఘల్ బేగ్, అజీజ్‌జిల్లా, షేక్ ఖలీల్, టిడిపి నాయకులు బండే రాఘవ, ఘంటసాల రాజమోహనరావు, లింగం బాబూరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీచేశారు.










