జైపూర్ : సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవాకులు చవాకులు పేలారు. అలాంటి వారి నాలుక కోస్తానని, కళ్లు పీకేస్తానని బెదిరించారు. రాజస్థాన్‌లోని బర్మర్‌లో మంగళవారం నిర్వహించిన ఓ ర్యాలీలో కేంద్ర మంత్రి పెట్రేగిపోయారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. సెనాతన ధర్మానికి ఎదురవుతున్న సవాళ్లను కలసికట్టుగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. 'సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నాలుక కోసేయాలి. ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా కళ్లు విప్పితే వాటిని పీకేయాలి' అని షెకావత్ చెప్పుకొచ్చారు.










