విజయవాడ: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ములాఖత్‌లు పెంచాలని టిడిపి అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడలోని ఏసీబీ కోర్టును కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. లీగల్ ములాఖత్ రోజుకు మూడు సార్లు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.










