May 02,2023 12:56

ప్రజాశక్తి-బుర్జ (శ్రీకాకుళం) : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. విలేకరులతో విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ... ప్రజల కోరిక మేరకు రాజీనామా చేస్తున్నామన్నారు. తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. బుర్జ మాజీ వైస్‌ ఎంపీపీ పీరు కట్ల ప్రభాకరరావు కూడా మండల కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు బి.సత్యవతికి అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీరికట్ల సీత బాబు, మామిడి వెంకటి సూర్యం, తదితరులు పాల్గొన్నారు.